హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థత వల్లే అభివృద్ధిలో హైదరాబాద్ నగ రం తిరోగమనంలో పయనిస్తున్నది. దీనికి ఆయనదే ప్రధాన బాధ్యత’ అని బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అం దించి పెద్ద ఎత్తున ఆహ్వానించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గన్నులు ఎక్కుపెట్టి రాకుండా చేస్తున్నదని దుయ్యబట్టారు.
మంత్రి కొండా సురేఖ వరంగల్‌ను గాలికొదిలేసి, జూ బ్లీహిల్స్లోని షేక్‌పేటలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ నగరంలో కులుషిత నీళ్లు సరఫరా అవుతుంటే, ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించలేని మంత్రి.. జూబ్లీహిల్స్‌లో ఏమని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్య ఎన్నికల క్యాం పెయినర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి వస్తే బీఆర్ఎస్ గెలుపు నూరుశాతం ఖాయమైనట్టేనని జోస్యం చెప్పారు. హైడ్రా, మూసీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి నగర ప్రజలకు గూడు లేకుండా చేశారని దుయ్యబట్టారు. హామీల అమలులో విఫలమయ్యారని విమర్శించారు.