సారంగాపూర్, నవంబర్ 19: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్లధర్మారంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మంగళవారం గ్రామంలో పర్యటించారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నారపాక రవీందర్ ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ జెండా పట్టుకుని రోడ్డు పక్కన నిలబడి ఉన్నాడు.
రవీందర్ ఏదైనా గొడవ చేస్తాడేమోనని ముందస్తుగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని వాహనంలో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ‘నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నరు.. నేనేం తప్పు చేసిన సార్.. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వాగతం పలికేందుకు ఇక్కడ జెండా పట్టుకుని నిల్చున్నా.. ’ అని వాదించినా పోలీసులు వినకుండా ఠాణాకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నేరెళ్ల సుమన్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ కొల్ముల రమణ, నాయకులు ఠాణాకు వెళ్లి పోలీసులతో మాట్లాడి రవీందర్‌ను బయటకు తీసుకువచ్చారు.