అన్ని రోడ్లను బ్లాక్ చేసిన పోలీసులు
కార్యకర్తలకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట
BRK Bhavan | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్‌ను పోలీసులు దిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు. బీఆర్కే భవన్‌కు వచ్చే మూడు మార్గాలను పూర్తిగా మూసివేశారు. బీఆర్కే భవన్‌తో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
కేసీఆర్‌కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివస్తున్నారు. వచ్చిన కార్యకర్తలు ఎవరిని కూడా లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. సర్కార్ వందల సంఖ్యలో పోలీసులు మోహరించి ఇక్కడ యుద్ధ వాతావరణ సృష్టిస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసుల తీరుపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు.