Virendra Sharma | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అంబేద్కర్ విగ్రహం తెలంగాణకే గర్వకారణమన్నారు. అంబేద్కర్ ఆలోచనలు భారతదేశ ఆధునిక రాజ్యాంగానికి రూపునిచ్చాయని, అభివృద్ధి, బహుళత్వానికి ప్రాధాన్యతనిచ్చాయన్నారు.
భవిష్యత్తు గురించి అంబేద్కర్‌కు ఓ దార్శనికత ఉందని, మనం ఇంకా పూర్తిగా గ్రహించలేదన్నారు. యూకేలోని తెలంగాణ సంస్థతో కలిసి పనిచేయడం గర్వంగా ఉందన్నారు. కేసీఆర్‌ను త్వరలో యూకేలో చూడాలనుకుంటున్నానన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినాలనుకుంటున్నామన్నారు. యునైటెడ్ కింగ్డమ్, తెలంగాణ ప్రవాసుల సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని ఉత్తేజపరిచేందుకు, సుసంపన్నం చేయడానికి త్వరలో తమతో కలుస్తారని ఆశిస్తున్నారన్నారు.