Vedma Bhojju | ఇసుక తీసుకురండి.. ఎవడు అడ్డొస్తాడో చూసుకుందాం.. వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు!
Vedma Bhojju | కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అటవీ అధికారులు అడ్డుకుంటే తిరగబడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేశారు.
Vedma Bhojju | జన్నారం, జూలై 16 : కవ్వాల్ టైగర్ జోన్ పేరుతో ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అటవీ అధికారులు అడ్డుకుంటే తిరగబడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా జన్నారం జ్యోతి గార్డెన్లో గు రువా టరం నిర్వహించిన ‘సర్’ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘వాగులు, గోదావరి రేవు నుంచి ఇసుక తీసుకురం డి.. ఎవరు అడ్డు వస్తారో చూసుకుందాం’ అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వా ట్సాప్ గ్రూప్‌లో ప్రతిపక్ష నాయకులకు ఉ ద్దేశిస్తూ పరుషపదజాలంతో మెసేజ్‌లు చేయడాన్ని ఓ టీవీ చానల్ ప్రముఖంగా ప్రసారం చేసింది.
‘యథారా టజా.. తథాప్రజా.. ముఖ్యమంత్రి రేవంత్ బాటలోనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం వెళ్తున్నారని.. జన్నారంలో ఇసుక రవాణాను ప్రశ్నించిన ఓ లీడర్‌ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పురుషపదజాలంలో దూషించి స్థానిక వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు చేశారు’ అని సదరు చానల్ బ్రేకింగ్ న్యూస్ వేసింది. దాన్ని ఉద్దేశిస్తూ సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సదరు చానల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇష్టం ఉన్నట్టు పరుషపదజాలంలో వాట్సాప్ గ్రూపులో మెసేజ్‌లు చేయడమే కాకుండా, ఆ విషయంపై వార్త ప్రసారం చేసిన చానల్‌పై ఎమ్మెల్యే నోరు పారేసుకోవడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

