హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద కేసుగా పరిగణిస్తున్న హేరూర్ నికేశ్‌కుమార్ ఆస్తులపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నికేశ్‌కుమార్ బినామీల బ్యాంకు లాకర్లను మంగళవారం తెరుస్తారని సమాచారం. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఏసీబీ.. నికేశ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా విచారించి, అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. ఏసీబీ నవంబర్‌లో 17 ట్రాప్‌లతో పాటు ఆదాయానికి మించిన ఓ కేసును నమోదు చేసింది. 17 ట్రాప్‌లలో 27 ప్రభుత్వ ఉద్యోగులు, ముగ్గురు ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచాల కోసం వేధిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని, ఎక్స్‌లో (twitter @Telanga naACB), ఫేస్బుక్లో (@telangan aacb) ప్లాట్‌ఫామ్‌లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.