CM Breakfast | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లోని విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని నీరుగార్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇదే పథకానికి కొత్త రంగులద్దింది. మళ్లీ తిరిగి ప్రారంభించనుండగా, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలుచేయాలని నిర్ణయించింది. హరేకృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా బ్రేక్‌ఫాస్ట్ స్కీంను అమలుచేయనున్నారు. నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28 వేల మంది పిల్లలకు అల్పాహారాన్ని అందజేసేందుకు వయాట్రిక్ ఫార్మా సంస్థ ముం దుకొచ్చింది. సీఎస్సార్ నిధుల నుంచి రూ.6.4కోట్లను విరాళంగా అందజేసింది. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రెండు సంస్థల మధ్య ఎంవోయూ కుదిరింది. దాతల సహకారంతో బ్రేక్‌ఫాస్ట్ స్కీంను అమలుచేసే అంశాన్ని ఇటీవలే ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘దాతలు దయతలిస్తేనే బ్రేక్‌ఫాస్ట్’ శీర్షికతో 22న కథనాన్ని ప్రచురించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రికల్ బస్సుల కోసం నూతనంగా పది డిపోలు అవసరమని ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు చేసింది. ఒకో డిపోకు రూ.10 కోట్ల చొప్పున రూ.100 కోట్లు.. ఒకో డిపోకు 10 ఎకరాల చొప్పున 100 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ సరఫరా అవసరమని ఆర్టీసీ భావిస్తున్నది. ఇతగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నది.