యాదాద్రి, అక్టోబర్ 22: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో త్వర లో బ్రేక్ దర్శనం భక్తులకు అందుబాటులోకి రానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం గుండా ఈశాన్య ప్రాంతంలో నిర్మించిన వెలుపలి ప్రాకార మండపంలో బ్రేక్ దర్శనానికి క్యూ లైన్లను ఏర్పాటు చేసి, త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేయనున్నారు. రోజూ ఉద యం 9 నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు బ్రేక్ దర్శనం ఇవ్వనున్నట్టు ఆలయ ఈవో గీత వెల్లడించారు. బ్రేక్ దర్శన సమయంలో ధర్మ దర్శనం, రూ.150 దర్శ నం నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. బ్రేక్ దర్శనం టికెట్ ధర రూ.300 ఉంటుందన్నా రు. బ్రేక్ దర్శనంలో వచ్చే భక్తులకు స్వయం భూ మూర్తుల దర్శనంతోపాటు గర్భాలయం లో హారతిని ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రభు త్వం నుంచి ఆదేశాలు రాగానే బ్రేక్ దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.