హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : పేదరిక నిర్మూలనకు అంతర్జాతీయ సహకార సంస్థ ‘బ్రాక్’ సహకరించాలని మంత్రి సీతక్క కోరారు. సోమవారం సచివాలయంలో సీతక్కతో బ్రాక్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అత్యంత పేద కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే టీజీఐఎల్పీ లక్ష్యమని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): జాతీయ నూనెగింజల పథకంలో భాగంగా రైతులకు ఉచితంగా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. మంగళవారం ఎనిమిది జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఎఫ్‌పీవోల ద్వారా ఎంపికైన రైతులకు మాత్రమే ఉచిత విత్తనాల పంపిణీ చేస్తామని స్పష్టంచేశారు. రూ. 46.15కోట్ల విలువైన 38,434 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేస్తామని చెప్పారు.