హైదరాబాద్ జూన్ 15 (నమస్తేతెలంగాణ): ప్రైవేట్ మెడికల్ కాలేజీల మెడికోలు ఇంటర్న్స్ ైస్టెపెండ్ కోసం పోరుబాట పడుతున్నారు. మూడు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ అకడమిక్(డీఎంఈ), టీజీఎంసీ చైర్మన్ల దృష్టికి పలుమార్లు సమస్యలను తీసుకెళ్లారు. అనేకసార్లు వినతిపత్రాలు అందించారు. మంత్రిని కలిసి కొన్ని వైద్య కళాశాలలు విద్యార్థుల ఖాతాల్లో ఇంటర్న్స్ ైస్టెపెండ్ జమచేసి తిరిగి వాపస్ తీసుకుంటున్నాయని ఆధారాలు సమర్పించారు. అయినా పట్టించుకోకపోవడంతో నిరసనలకు ఉపక్రమించాలని నిర్ణయించారు. ఈ దిశగా కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి విధులు బహిష్కరించనున్నట్టు ప్రకటించారు. సర్కారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు దిగొచ్చేదాకా పోరాటాన్ని ఆపబోమని హెచ్చరించారు.
జాతీయ లోక్ అదాలత్తో 1.93 లక్షల కేసుల పరిషారం ; డీజీపీ జితేందర్ వెల్లడి
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 14న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్తో రాష్ట్రవ్యాప్తంగా 1,93,439 కేసులు పరిషారమైనట్టు డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పరిష్కారమైన కేసుల్లో 6,294 సైబర్, 22,095 ఎఫ్ఐఆర్, 8,922 విపత్తు నిర్వహణ చట్టం, 84,601 ఈ-పెటీ, 71,527 మోటారు వాహన చట్టం కేసులు ఉన్నట్టు వివరించారు. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 32,171, రాచకొండ 21,397, నల్లగొండ 16,496, వరంగల్ 13,651, రామగుండంలో 13,316 కేసులు ఉన్నట్టు తెలిపారు. ఒకేసారి సుమారు రెండు లక్షల కేసులు పరిష్కారమయ్యేందుకు కృషి చేసిన రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ, జిల్లా న్యాయమూర్తులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో సిబ్బందిని డీజీపీ అభినందించారు.