జగిత్యాల, అక్టోబర్ 5 : బొమ్మలతో ఆడుకోవాల్సిన ఆ బాలుడు.. దవాఖానలో స్లైన్ బాటిల్స్, ఇంజక్షన్స్, టాబ్లెట్స్‌తో దినమొక గండగా గడుపుతున్నాడు. చిన్న వయసులోనే బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతుండగా, పేద కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు కొడుకు వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఉన్న బంగారం తాకట్టు పెట్టి చికిత్స చేయిస్తుండగా, మరో రూ.20 లక్షలకు పైగా అవసరమవుతాయని దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా కేంద్రంలో అద్దె ఇంట్లో ఉంటూ కాంట్రాక్టు పద్ధతిన మండల రిసోర్స్ పర్సన్‌గా పని చేసే గొల్లపల్లి మండలం చిల్వకోడూర్‌కు చెందిన అల్లాడి ప్రభాకర్, అనురాధ దంపతులకు 8 ఏళ్ల క్రితం బాబు జన్మించగా, అనారోగ్యంతో ఏడాది వయసులోనే మరణించాడు. రెండున్నరేళ్ల క్రితం మరో బాబు రుద్రాన్ష్ జన్మించగా ఏడాది నుంచి బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతున్నాడు. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇందుకోసం వీరికున్న స్థలాన్ని అమ్మడానికి సిద్ధపడగా రూ.10 లక్షలు సమకూరనున్నాయి.
మరో రూ.10 లక్షల కోసం దాతలను ఆశ్రయిస్తున్నారు. ఏడాదిగా ప్రతి నెలా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు వెళ్తూ బ్లడ్ ఎకించడం, టెస్టులు, మందులకోసం వారి వద్ద ఉన్న బంగారాన్ని అమ్మేశారు. వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్నారు. సాయం అందించి పసివాడి ప్రాణాన్ని కాపాడాలని తల్లిదండ్రులు అనురాధ, ప్రభాకర్ కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు అల్లాడి అనురాధ, అకౌంట్ నం.320362 06572, ఐఎఫ్‌సీ కోడ్ ఎస్బీఐఎన్00053 65, అల్లాడి ప్రభాకర్ ఫోన్ నం.9550904622కు డబ్బు లు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.