సిద్దిపేట: వారాంతాల్లో పిల్లలను అయితే పార్కులకు, లేదంటే సినిమాలకు తీసుకెళ్లి బోర్ కొట్టిందా..? ఇక ముందు ఒక్క వారమైనా కొత్తదనం ఉంటే బాగుండును అనుకుంటున్నారా..? అయితే, ఈ సారి ట్రెక్కెంచర్ను ప్రయత్నించండి. ప్రకృతి అందాల మధ్య కొండలు, గుట్టలు ఎక్కిదిగడం మీకు, మీ పిల్లలకు మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఓ అడ్వెంచర్ కంపెనీ ఇప్పుడు కొత్త వారాంతపు క్యాంపింగ్ ప్రోగ్రామ్‌తో మీ ముందుకు వచ్చింది. ఇది పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా మంచి వారాంతపు అనుభూతిగా మిగిలిపోతుంది.
సిద్దిపేట సమీపంలోని మాతెపల్లి గ్రామంలో ఉన్న ఈ ట్రెక్కెంచర్ మీరు వారాంతంలో ప్రకృతి మధ్య ఆనందంగా గడిపే అవకాశం కల్పిస్తుంది. నగరాల్లో నివసించే వారికి ప్రకృతి అందాలు అంతగా అందుబాటులో ఉండవు. దాంతో వారుగానీ, వారి పిల్లలుగానీ ప్రకృతిని ఆస్వాదించడం అత్యంత అరుదుగా జరుగుతుంది. అలాంటి వారికి ఇలాంటి వారాంతపు శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. పెద్దవాళ్లు ఈ శిబిరాల్లో సేదదీరవచ్చు. వారి పిల్లలకు ప్రకృతి గురించి ఎన్నో విషయాలను తెలియజేయవచ్చు.
25 నుంచి 30 మంది సమూహాలుగా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చని, ప్రకృతి అందాల నడుమ చిన్నచిన్న చెరువులను చుట్టేయవచ్చని, టెంట్ల కింద రాత్రి బసలు చేయవచ్చని, పిల్లలతో చిన్నచిన్న ఆటలు ఆడించవచ్చని ఈ ట్రెక్కెంచర్కు చెందిన అజిత్ అథవాలే చెప్పారు. నగర జీవులు ప్రకృతిలో తమకు తెలియని ఎన్నో విషయాలను ఈ ట్రెక్కెంచర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. విస్తరాకు చెట్లు (సాల్ ట్రీస్) వంటి కొన్ని ప్రత్యేక రకాల చెట్లను వారికి పరిచయం చేస్తామని చెప్పారు. అదేవిధంగా అడవుల్లో జీవించే రకరకాల పక్షులు, జీవరాశుల గురించి తాము వివరిస్తామన్నారు.
నవంబర్ 13, 14 తేదీల్లో వచ్చే వారంతంలో సిద్దిపేట సమీపంలోని మాతెపల్లి గ్రామంలో ఇలాంటి ట్రెక్కెంచర్ ప్రోగ్రామ్ జరుగనుంది. ఈ క్యాంపింగ్‌లో పాల్గొనేవారికి ఒక్కొక్కరికి రూ.2100 చార్జి చేయనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు అజిత్ అథవాలేను 8008288830 నంబర్లో సంప్రదించి రిజిస్టర్ చేసుకోవచ్చు.