బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ సంసృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు.
- 9న సికింద్రాబాద్,16న పాతబస్తీ బోనాలు
- మంత్రులు అల్లోల, తలసాని
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంసృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆదేశించారు. బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై మంగళవారం సచివాలయంలో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలకు ఈ ఏడాది కేటాయించిన రూ.15 కోట్లను వినియోగించుకోవాలని సూచించారు. 9న సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. బోనాల ఉత్సవాలకు వారం రోజుల ముందే ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్‌లు అందజేయాలని అధికారులకు సూచించారు. బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ, పర్యాటక, సమాచార శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ మహంకాళీ బోనాలకు రావాలని మంత్రులను ఆలయ కమిటీ ఆహ్వానించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

