తాత్కాలిక సీజే ఎమ్మెస్సార్ బదిలీ
- రాష్ర్టానికి బాంబే హైకోర్టు జస్టిస్ ఉజ్జల్ భూయాన్
- దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది న్యాయమూర్తుల బదిలీ
- కొలీజియం సిఫార్సుల మేరకు కేంద్ర న్యాయశాఖ గెజిట్

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావును పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బాంబే హైకోర్టు నుంచి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీ చేశారు. దేశవ్యాప్తంగా 11 హైకోర్టులకు చెందిన 15 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను మంగళవారం వెలువరించింది. బదిలీ అయినవారిలో అలహాబాద్ హైకోర్టు నుంచి ఏకంగా నలుగురు న్యాయమూర్తులు ఉన్నారు. ఏపీ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులను నియమించారు. జడ్జిల బదిలీలపై ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు చేసింది.
న్యాయవాద కుటుంబం నుంచే..
జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అస్సాం రాజధాని గువాహటిలో 1964, ఆగస్టు 2న జన్మించారు. ఆయన తండ్రి సుచేంద్ర నాథ్ భూయాన్ అస్సాం మాజీ అడ్వొకేట్ జనరల్. ఎన్నో సంక్లిష్ట కేసులను వాదించి గెలిచారు. గువాహటిలోనే ఇంటర్ వరకు విద్యనభ్యసించిన ఉజ్జల్ భూయాన్.. ఢిల్లీలో ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. గువాహటి ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ, గౌహతి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు. 1991లో బార్ కౌన్సిల్లో చేరిన ఆయన.. 2011లో అస్సాం అదనపు అడ్వొకేట్ జనరల్‌గా నియమితులయ్యారు. అదే ఏడాది గౌహతి హైకోర్టు అదనపు జడ్జిగా అపాయింట్ అయ్యారు. అనంతరం 2019లో బాంబే హైకోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

