దొంగతో కలిసి నిరసనలా?
‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదురొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పకన పెట్టుకొని, దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- ‘ఓటుకు నోటు’ నిందితుడిని పక్కన
- పెట్టుకొని కాంగ్రెస్ ఆందోళన సిగ్గుచేటు
- ‘ఓటు చోరీ’ నిరసనపై కేటీఆర్ నిప్పులు
- రాహుల్, రేవంత్ ద్వంద్వ వైఖరిపై ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : ‘ఓటుకు నోటు’ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదురొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పకన పెట్టుకొని, దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఓటు చోరీ జరుగుతున్నదంటూ నవంబర్ 1న ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ తలపెట్టిన ఆందోళన కార్యక్రమం అత్యంత హాస్యాస్పదంగా ఉన్నదని శనివారం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పరిరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే కాంగ్రెస్ పెద్దలు, వాస్తవంలో చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు.
ఫిరాయింపులను స్వయంగా ప్రోత్సహించిన కాంగ్రెస్
తెలంగాణలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను స్వయంగా ప్రోత్సహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇప్పుడు దేశంలో ఓటు చోరీ అంటూ దొంగ దీక్షలకు పూనుకోవడం విడ్డూరంగా ఉన్నదని కేటీఆర్ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నట్టు నాటకమాడుతూ, మరోవైపు చట్టసభల సభ్యులను ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్ నైతిక పతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. దేశంలోనే అతిపెద్ద ‘ఓటుకు నోటు’ సామ్స్టర్గా ఆరోపణలు ఉన్న వ్యక్తిని వెంటబెట్టుకొని నీతులు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
ఓవైపు ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ, మరోవైపు ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి నిరసనలు చేపట్టడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన రాజకీయాలు నడుపుతూ, కేంద్రంలో మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షకుల్లా నటిస్తున్నారని ఎండగట్టారు. ఇలాంటి కపట రాజకీయాలకు కాలం చెల్లిందని హెచ్చరిస్తూ ‘భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి’.. ‘జై హింద్’, ‘జై తెలంగాణ!’ అంటూ ముగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

