శంషాబాద్ రూరల్, నవంబర్ 23 : బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న జీఎఫ్-274 విమానంలో బాంబు ఉన్నట్టు కస్టమర్ ఐడీ పేరుతో వచ్చిన బెదిరింపు మెయిల్ అధికారుల్లో కలకలంరేపింది. ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బహ్రెయిన్ ఎయిర్‌పోర్టు నుంచి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్టుగా ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులకు మొయిల్ వచ్చింది.
వెంటనే అప్రమత్తమైన అధికారులు విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టుకు డైవర్ట్ చేశారు. అనంతరం విమానంలో విస్తృతంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబులేదని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో 154 మంది ప్రయాణికులు ఉన్నారు. బాంబు బెదిరింపుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.