ములుగు : ములుగు (Mulugu)జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత వాటర్ ఫాల్స్‌కు(Bogatha water fall) బుధవారం జలకళ వచ్చింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు మండలంలోని ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి గుట్టలపై నుంచి వచ్చిన వరద నీరు చేరి ప్రవాహం(Huge flood water )కొనసాగింది. కొన్ని నెలలుగా నీళ్లు లేక వెలవెలబోయిన జలపాతంలోకి వరద నీరు చేరడంతో ఆకట్టుకుంటోంది. బొగత అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు.