బోధన్, జూన్ 8: మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. విషయం తెలిసి రంగంలోకి దిగిన ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి స్వయంగా వెళ్లారు.
ఆమె వెంట పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, వేం నరేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, మరికొంద రు నేతలు ఉన్నారు. అసంతృప్తితో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందని మీనాక్షి ఆయనకు నచ్చజెప్పినట్టు తెలిసింది. దీంతో మెత్తబడిన ఎమ్మెల్యే అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అనుచరులకు చెప్పినట్టు తెలిసింది.