హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ప్రముఖ జర్నలిస్టు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి టీ శాట్ నూతన సీఈవోగా నియమితులయ్యారు. ఈ మేరకు ఐటీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ మంగళవారం జీవో-5ను విడుదల చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం కొరటికల్‌కు చెందిన వేణుగోపాల్‌రెడ్డి తెలంగాణ వర్సిటీలో ఎంఏ మాస్ కమ్యూనికేషన్ పూర్తిచేశా రు. జర్నలిజంలో 17 ఏండ్ల అనుభవమున్న ఆయన పాత్రికేయ రంగంలో ఉంటూనే మూడేండ్లుగా తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.