అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ ( Journalist KVR ) కు బొబ్బిలి కోర్టు ఈనెల 14వ తేదీ వరకు రిమాండ్ ( Remand ) విధించింది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బాడంగి పోలీసులు కేవీఆర్( కె వెంకటరామిరెడ్డి) ని అరెస్టు చేసి ఏపీలోని విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
గురువారం బొబ్బిలి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో బొబ్బిలి జైలుకు తరలించారు. భారత రాజ్యాంగం, ఏపీ నాయకులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కేవీఆర్‌పై విజయనగరం జిల్లా బాడంగి మాజీ సర్పంచ్ కండి రమేష్ ఏప్రిల్ 10న బాడంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో గత మంగళవారం బొబ్బిలి గ్రామీణ సీఐ శ్రీనివాస్‌తో కూడిన పోలీసులు కేవీఆర్‌ను ఇంటి వద్ద అరెస్టు చేసి తీసుకెళ్లారు.