రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరం శివారులోని మిడ్మానేరు జలాశయంలో తెప్పల పోటీలు అలరించాయి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పోటీలు నిర్వహించగా, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సంకాంత్రి సెలవులు కావడంతో పోటీలను చూసేందుకు పలు గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 12 మంది చొప్పున జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.
– వేములవాడ రూరల్