హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ) : ఇటీవల ఆదిలాబాద్, ఖమ్మం అడవుల్లో వెలుగుచూసిన బ్లూ మష్రూమ్(నీలిరంగు) పుట్టగొడుగులు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ)కు చేరాయి. వాటి ఉనికి, స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఎఫ్సీఆర్ఐ ప్రొఫెసర్లు దృష్టిసారించారు. జూలై 20న ఆదిలాబాద్‌లో, తాజాగా ఖమ్మం జిల్లా పెనుబల్లి అడవుల్లో ‘సైబ్లూ మష్రూమ్స్’ వెలుగుచూశాయని, వీటిని న్యూజిలాండ్‌కు చెందిన అరుదైన నీలి పుట్టగొడుగులుగా గుర్తించినట్టు తెలిపారు.
ఎంటొలోమా జాతికి చెందిన ఈ పుట్టగొడుగులు విషపూరితమైనవా, ఆహారంగా ఉపయోగించదగినవా అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఎఫ్సీఆర్ఐ(ములుగు) ప్రొఫెసర్లు వెల్లడించారు.