స్వాతంత్రోద్యమంలో బీజేపీ పాత్ర శూన్యం
‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం.. దేశ భక్తులమని చెప్పుకొనే హక్కు ఆ పార్టీ నాయకులకు లేదు’ అని మాజీ ఎమ్మె ల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. అనేక జాతులు,
- దేశభక్తులమని చెప్పుకొనే హక్కు వారికి లేదు:్ర పొఫెసర్ నాగేశ్వర్
కరీంనగర్ తెలంగాణచౌక్, సెప్టెంబర్ 15 : ‘దేశ స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యం.. దేశ భక్తులమని చెప్పుకొనే హక్కు ఆ పార్టీ నాయకులకు లేదు’ అని మాజీ ఎమ్మె ల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. అనేక జాతులు, మతాలు, తెగలు సమైక్యంగా ఉన్న దేశంలో కుల, మతాల పేరిట చిచ్చు రగిలించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని మం డిపడ్డారు. ‘మా దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వం’ అని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్లో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ నాలుగో మహాసభల్లో గురువారం ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని విమోచన దినోత్సవం అంటూ బీజేపీ చరిత్రను వక్రీకరిస్తున్నదని దుయ్యబట్టా రు.
ఈ సందర్భాన్ని హిందూ, ముస్లింల మధ్య గొడవలుగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నదని తప్పుబట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో షోయబుల్లాఖాన్తోపాటు మరెందరో ముస్లింలు పాల్గొన్నారని గుర్తుచేశారు. కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల ను నిర్మించి ప్రజలను విభజించేందుకు కుతంత్రాలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ప్రధా ని మోదీ పాలనలో పౌరహక్కులు ప్రశ్నార్థకమయ్యాయని ధ్వజమెత్తారు. కేంద్రంలోని పెద్దలు అంగట్లో సరుకులా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చివేస్తూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు విరుచుకుపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- freedom struggle
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
Tragedy | పాకాల బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
ఎంవి పాలెం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం?
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

