హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి, భంగపడ్డ బీజేపీపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ తనదైన శైలిలో చెలరేగిపోయారు. శనివారం ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్‌టాగ్‌తో.. ‘వారేమైనా పొలిటికల్ సేఫ్టీ కండోమ్స్ అమ్ముతున్నారా?’ అంటూ ట్వీట్ చేశారు.
తమ పార్టీలో చేరితే ఈడీ, ఐటీ సంస్థల నుంచే కాకుండా అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తామని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి నిందితుడు రామచంద్రభారతి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇలా స్పందించారు.
Are they Selling Political safety CONDOMS 🤣🤣🤣🤣#justasking https://t.co/N8dPnxg4y1
— Prakash Raj (@prakashraaj) October 28, 2022