మనువాదం అమలే ఏకైక లక్ష్యం
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి
హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి మొదటినుం చి బీజేపీ వ్యతిరేకమని, అది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఏకైక పార్టీ అని రా ష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. దేశంలో మనువాదం అమలు చేయడమే ఆ పార్టీ లక్ష్యమని దుయ్యబట్టారు. కేంద్రం, రా ష్ర్టాల మధ్య ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం పెత్తనం ఉండకూడదన్న ఉద్దేశంతోనే రాజ్యాంగంపై చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారని చెప్పారు. గ్రామీణ, పట్టణాభివృద్ధి, పోలీసు వ్యవస్థలో కేంద్రం జోక్యం చేసుకోవడంపై నిరాశ, నిస్పృహకు గురైన సీఎం కేసీఆర్ ఆవేదనతోనే రాజ్యాంగంలో మార్పులు తేవాలన్నారని తెలిపారు. దేశంలోని కీలక రంగాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలన్న రాజ్యాంగ ని బంధనలకు తూట్లు పొడిచిన ఘనత మోదీ ప్ర భుత్వానిదని విమర్శించారు. మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని 25 ఏండ్లుగా ఉద్య మం చేస్తున్నా, పార్లమెంట్లో ఆ బిల్లుపై చర్చ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.