నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 28: మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం మునుగోడుకు చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మర్రిగూడ మండలం కొండూరుకు చెందిన 20 మంది కారెక్కారు. సంస్థాన్ నారాయణపురం మండలం తూం బావితండా, రాధానగర్తండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి సత్యవతి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెంకు చెందిన వార్డుసభ్యుడు ఎం వెంకటేశ్, కాంగ్రెస్‌కు చెందిన పలువురు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండు వా కప్పుకొన్నారు. వివిధ మండలాలకు చెందిన పలు పార్టీల వారు ఎమ్మెల్యేల సమక్షంలో గులాబీ గూటికి చేరారు.