YouTuber | బండ్లగూడ, ఏప్రిల్ 2: బీజేపీ నాయకుడు, చిత్రగుప్త యూట్యూబ్ చానల్ యజమాని గిరీశ్పై మంగళవారం అదే పార్టీ నాయకులు దాడి చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌పై గిరీశ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కోపోద్రిక్తులైన కొందరు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.
మంగళవారం అతనిపై బీజేపీ కార్యకర్తలు తరలివచ్చి గిరీశ్పై, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలియగానే పోలీసులు వచ్చి గిరీశ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాడి ఘటనపై కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదని గిరీశ్ ఆందోళన వ్యక్తంచేశారు.