హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన కమిటీని పార్టీ హైకమాండ్ సోమవారం ప్రకటించింది. 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 8మంది కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో కమిటీని నియమించినట్టు వెల్లడించింది. ఇందులో డా ఎన్ గౌతమ్‌రావు, టీ వీరేందర్‌గౌడ్, వేముల అశోక్‌లను ప్రధాన కార్యదర్శులుగా, మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ మేకల శిల్పారెడ్డి, యువ మోర్చా అధ్యక్షుడిగా గణేశ్ కుందె, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బస్వపురం లక్ష్మీనర్సయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కాంతి కిరణ్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా ఎన్ రవినాయక్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా జీ ఆనంద్‌గౌడ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా సర్దార్ జగన్మోహన్సింగ్లను నియమించినట్టు తెలిపింది.