హైదరాబాద్, జూన్ 2(నమస్తేతెలంగాణ): జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ సభకు హైదరాబాద్‌లో అనుమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభ పెట్టుకోవచ్చని, అక్బరుద్దీన్‌కు నిర్మల్, బోధన్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా? అని ఆయన ప్రశ్నించారు. జనసేన సభకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ ఎమర్జెన్సీ మైండ్ సెట్‌కి నిదర్శనంగా పేర్కొన్నారు.