హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడం అప్రజాస్వామికం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు రాంచందర్‌రావు మండిపడ్డారు. శు క్రవారం ఆయన ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ.. అభివృద్ధి కోసమే తా ము కాంగ్రెస్‌లో చేరినట్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలు గతంలోనే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగలేదని, రైతులను మోసం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.