చౌటుప్పల్ : నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఓటర్లు బుద్ధి చెప్పాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధి తాళ్లసింగారం గ్రామంలో ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. అణగారిన వర్గాలకు సైతం అన్ని రకాలుగా అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు.
వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ప్రతినెలా పింఛన్ అందజేస్తు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ ను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. తాళ్లగూడెంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను పలకరించారు. బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.