హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): మంత్రి సీతక్క పేరున్న స్టిక్కర్ అతికించిన కారులో బీజేపీ కండువా కనిపించడం రాజకీయవర్గాల్లో చ ర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేల వా హనాల ఎంట్రీ పాస్ కోసం శాసనసభ అధికారులు ప్రత్యేకంగా స్టిక్కర్ జారీ చేస్తా రు. అలాంటి స్టిక్కర్ ఓ కారు ముందుభాగంలో అతికించి ఉంది. స్టిక్కర్‌పై సీతక్క(అసలు పేరు అనసూయ), ములుగు ఎమ్మెల్యే అని రాసి ఉంది. ఈ వ్య వహారంపై కాంగ్రెస్ బహిష్కృతనేత బక్క జ డ్సన్ ఆరోపణలు చేశారు.సీతక్క కారులో బీజేపీ కండువా ఉందా? బీజేపీ నేతలకు సీతక్క ఎమ్మెల్యే పాస్ ఇచ్చారా? ఒకవేళ కారు స్టిక్కర్ దొంగతనానికి గురైతే పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు.