Guvvala Balaraju | హైదరాబాద్ : అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇవాళ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు సమక్షంలో గువ్వల బీజేపీ గూటికి చేరారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజుకు రామ్‌చందర్ రావు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గువ్వల బాలరాజుకు బీజేపీ సభ్యత్వం అందజేశారు రామ్‌చందర్ రావు.
ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఇది ఆర్డినరీ మెంబర్షిప్. గువ్వల బాలరాజు వెంట 100 మంది చేరితేనే ఆయనకు రూ. 100 మెంబర్షిప్ ఇస్తామని రామ్‌చందర్ రావు ప్రకటించారు. అంటే గువ్వల బాలరాజు వెంట ఇవాళ కనీసం ఓ వంద మంది కూడా బీజేపీలో చేరలేదని స్పష్టంగా స్వయానా రామ్‌చందర్ రావే ప్రకటించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
గువ్వల వెంట కనీసం 100 మంది కూడా జాయిన్ కాలేదని చెప్పేసిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు pic.twitter.com/Z44ojnlZwj
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2025