కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 30: కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్టీ కార్పొరేటర్లుగా కొనసాగుతున్న మర్రి భావన, కచ్చు రవితోపాటు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి సతీశ్ సోమవారం సాయంత్రం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని, ప్రజలకు అందుబాటులో లేని ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో తాము ఉండలేమని స్పష్టం చేశారు.