హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అంశం ైక్లెమాక్స్కు చేరింది. రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
మంగళవారం మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాలులో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరుగుతున్నది. ఆదివారం అనూహ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్రావు పేర్లు తెరపైకి వచ్చాయి. వీరితోపాటు ఎంపీలు అర్వింద్, డీకే అరుణ కూడా ఈ పదవికి పోటీ పడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.