KTR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామని కేటీఆర్ తెలిపారు. పార్లమెంటులో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలను ముందుగా ఖండించింది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు అని తెలిపారు. ఈ వివాదం తర్వాత తేజస్వి సూర్య కూడా తనకు ఫోన్ చేశాడని పేర్కొన్నారు. తేజస్వి నాకు ఫోన్ చేసి.. మీ వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారని కేటీఆర్ తెలిపారు. లేదు లేదు.. మీరు మాట్లాడింది చాలా తప్పు అని సూటిగా చెప్పానని పేర్కొన్నారు. మీరు మాట్లాడింది అస్సలు కరెక్ట్ కాదని ఆయనకు గట్టిగా చెప్పానని అన్నారు. మేం ఖండించిన తర్వాతనే ఆయన వివరణ ఇచ్చారని స్పష్టం చేశారు. తేజస్వి మాట్లాడిన సమయంలో సభలో ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా అప్పుడే అతనితో క్షమాపణలు చెప్పించి ఉండేవాళ్లమని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో తెలంగాణ విభజన గురించి తప్పుగా మాట్లాడితే.. ముందుగా ఖండించింది మా రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర, దామోదర్ రావు గారు
తేజస్వి సూర్య నాకు కూడా ఫోన్ చేశాడు.. నేను మాట్లాడింది మీ వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు.. మీరు మాట్లాడింది… https://t.co/WjdjUiQy7t pic.twitter.com/i16EevtDPf
— Telugu Scribe (@TeluguScribe) April 27, 2026