హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ బీజేపీ స్కూల్లో డ్రాపౌట్ స్టూడెంట్‌గా దారి తప్పారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీ స్కూల్లో దేశం, జాతీయవాదం ఉంటాయని తెలిపారు. రాహు ల్ కోరిక మేరకే కులగణన, రిజర్వేషన్లు, మంత్రివర్గ విస్తరణ చేశారని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని రేవంత్‌రెడ్డి ఢిల్లీ నాయకులకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
ఏడాదిన్నర పాలనలో అవినీతి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేద ని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంపదను రేవంత్ ఢిల్లీకి మోస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి రాహుల్ గాంధీకి రాయబారా.. లేక తెలంగాణకు జవాబుదారా..? అని లక్ష్మణ్ ప్రశ్నించారు.