హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారని అడ్వకేట్ రవి కుమార్.. సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో జులై 13న ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ దూషించిన వ్యాఖ్యలకు సంబంధించిన యూట్యూబ్ వీడియో క్లిప్‌ను కూడా పోలీసులకు అందించారు. ఈ మేరకు పోలీసులు ఎంపీ అరవింద్‌పై ఐపీసీ సెక్షన్ 504, 505(1) సీ కింద కేసు నమోదు చేశారు.