MLA Maheshwar Reddy | రాష్ట్రంలో బీ-ట్యాక్స్.. 8-9 శాతం ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్: బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి
రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
- ‘ఆర్’ ట్యాక్స్‌కు పోటీగా ఓ మంత్రి వసూలు
- సీఎంకు ఎంత పట్టున్నదో తెలిసిపోతున్నది
- బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు
- ట్యాక్స్ విషయం కాంట్రాక్టర్లే చెప్పినట్టు వెల్లడి
MLA Maheshwar Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే ‘ఆర్’ ట్యాక్స్ అమల్లో ఉన్నదని, తాను ఎందుకు సొంతంగా ట్యాక్స్ వసూలు చేయొద్దనే ఉద్దేశంతో ఓ మంత్రి ‘బీ’ ట్యాక్స్‌కు తెరలేపారన్నారు.
కాంట్రాక్టర్ల నుంచి బిల్లులో 8-9 శాతం కమీషన్‌గా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కొందరు కాంట్రాక్టర్లు తమకు చెప్పారన్నారు. ‘బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ కాదు.. ఏం ట్యాక్సో నాకు తెలియదు. కొత్తగా వచ్చింది’ అని పేర్కొన్నారు. మంత్రులపై సీఎంకు ఎంత పట్టు ఉన్నదో అర్థం అవుతున్నదన్నారు.
రాష్ట్రంలో ఎన్నిరోజులు అధికారంలో ఉంటారో కాంగ్రెస్ నేతలకు నమ్మకం లేనట్టున్నదని, అందుకే ఉన్నప్పుడే దోచుకోవాలనే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి కోట్ల అప్పులు చేస్తున్నదని మండిపడ్డారు. 13 వారాల్లో రూ.13వేల కోట్ల అప్పు తీసుకున్నారని అన్నారు. మరో రూ. 4 వేల కోట్ల రుణం సేకరిస్తున్నారని చెప్పా రు. జీతాలకు, పెండింగ్ బిల్లుల మంజూరుకు అప్పులు చేస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

