‘నమస్తే తెలంగాణ’పై బీజేపీ అక్కసు
నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపెట్టారు.
- పెంట్లవెల్లిలో ప్రతుల దహనం
- బీజేపీ తీరుపై దండోరా ఆగ్రహం
కొల్లాపూర్, ఫిబ్రవరి 23: నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు నమస్తే తెలంగాణ దినపత్రికపై తమ అక్కసును వెళ్లగక్కారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో గురువారం బీజేపీ నాయకులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతులకు నిప్పుపెట్టారు. మతచాందసవాదుల చేష్టలను దండోరా నాయకులు తీవ్రంగా ఖండించారు. కమలం పార్టీ చేపట్టిన ప్రజాగోస, కార్నర్ మీటింగ్ సభను ఈనెల 21న పెంట్లవెల్లి పాత గ్రామ పంచాయతీ ఎదు ట ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అందుకు విరుద్ధంగా సభకు ఆ పార్టీ రాష్ట్రనేత, మాజీ ఎంపీ వివేక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు హాజరై మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మండల అధ్యక్షుడు బత్తిని కురుమయ్య నేతృత్వంలో వారి ప్రసంగాన్ని అడ్డుకున్నా రు.
ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ అధిష్ఠానానికి మాజీ ఎంపీ వివేక్ తప్పుడు నివేదికలు ఇస్తున్నారంటూ దండోరా నా యకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభ రచ్చరచ్చగా మారిం ది. కమలం, దండోరా వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకున్నా ప్రయోజనం లేకపోయింది. సదరు నేతలు తమ ప్రసంగాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి వెళ్లిపోతుండగా దండోరా కార్యకర్తలు కాన్వాయ్‌ని వెంబడిస్తూ దళిత ద్రోహి వివేక్, బీజేపీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశా రు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. బీజేపీ నాయకుల వైఖరిని ఎండగడుతూ దండోరా నాయకులు రహదారిపై బైఠాయించారు.
ఈ కథనం 22వ తేదీన నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘రచ్చ రచ్చ’ శీర్షికన ప్రచురితమైంది. నిజాలను జీర్ణించుకోలేని బీజేపీ నాయకులు గురువారం పెంట్లవెల్లిలో ఆందోళనకు దిగారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ ఘటనను స్థానికులతోపాటు దండోరా నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లేందుకు పత్రికలు మూలస్తంభమన్న విషయాన్ని విస్మరించి బీజేపీ నాయకులు గొడవకు దిగడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. స్థానిక బీజేపీ నాయకులు ఆందోళన చేస్తూనే స్థానిక విలేకరిని దూషించడం, అంతుచూస్తామని బెదిరించడం హేయమైన చర్యగా జర్నలిస్ట్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా కమలం పార్టీ నాయకులు వంకరధోరణిని మానుకోవాలని వారు హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

