హైదరాబాద్ : మెడికల్ సీటు ఇప్పిస్తానని మోసం చేసిన బీజేపీ నేత కొత్తపల్లి సతీశ్ కుమార్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ సీటు ఇప్పిస్తానని చెప్పి.. ఓ వ్యక్తి నుంచి కొత్తపల్లి సతీశ్ రూ. 48 లక్షలు వసూలు చేశాడు. సీటు ఇప్పించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధిత వ్యక్తి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి సతీశ్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరు పరిచారు. కొత్తపల్లి సతీశ్ కుమార్ గతంలో జనగాం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.