బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. నాలుగు రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో బీసీ నేత పిల్లి రామరాజుయాదవ్పై నాగం అనుచరులు దాడికి పాల్పడ్డారు. నాగం వర్షిత్ రెడ్డి ఆదేశాలతోనే దాడి జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును పిల్లి రామరాజు కలిసి ఫిర్యాదు చేశారు.
పిల్లి రామరాజు ఫిర్యాదుతో ఈ ఘటనను బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. బీసీ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో నాగం వర్షిత్ రెడ్డిని మందలించింది. కాగా, నాగం వర్షిత్ రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని బీజేపీ రాష్ట్ర కేడర్ డిమాండ్ చేస్తుంది. కేడర్ డిమాండ్‌తో వర్షిత్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.