హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : చట్టసభల సభ్యులు 30 రోజులు జైలులో ఉంటే వారి పదవులు రద్దయ్యే చట్టం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఒకవేళ అలాంటి చట్టం వస్తే దాదాపు రెండేండ్లు జైలులో ఉన్న అమిత్షా పదవినే ముందుగా రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
సీబీఐ, సీఐడీ, ఈడీ, న్యాయవ్యవస్థ, నీతిఆయోగ్ వంటి వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేయనివ్వడంలేదని విమర్శించారు. చివరకు ప్రధానమంత్రి కార్యాలయం ఏది చెప్తే రాష్ట్రపతి భ వన్ అది చేసే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలో ఆయన మాట్లాడుతూ. పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేయడం ద్వారా దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.