మంచిర్యాల జిల్లాలో బీజేపీ తలకిందులైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘ప్రజల గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో అపశృతి జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఆ పార్టీ జెండాను ఎగిరేయగా, అది తలకిందులుగా కనిపించింది. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది.
మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలంలో ‘ప్రజల గోస – బీజేపీ భరోసా’ యాత్రలో భాగంగా గురువారం ఆ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ తీశారు. హాజీపూర్ మండలంలోని ముల్కల్ల గ్రామంలో బీజేపీ పతాకాన్ని ఎగురవేశారు. కాగా, జెండా తలకిందులుగా కనిపించింది. దీంతో అక్కడే ఉన్న నాయకులు జెండాను కిందికి దించి సరిచేసి, ఎగురేశారు. దీన్ని కొందరు వీడియో తీసి, సోషల్మీడియా పెట్టారు. జెండానే సరిగా ఎగిరేయలేనివారు గెలిస్తే ఏం చేస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలో బీజేపీ తలకిందులైంది. భారతీయ జనతా పార్టీ చేపట్టిన ప్రజల గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో అపశృతి జరిగింది. నాయకులు, కార్యకర్తలంతా కలిసి ఆ పార్టీ జెండాను ఎగురేయగా, అది తలకిందులుగా ఎగిరింది. ఈ వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. pic.twitter.com/Ngta0VeNaN
— Namasthe Telangana (@ntdailyonline) September 8, 2022