T20 World Cup : పొట్టి ప్రపంచకప్ లీగ్ దశ మ్యాచ్‌లు ఉత్కంఠ రేపుతున్న వేళ.. పలు జట్లు కీలక ఆటగాళ్లను కోల్పోతున్నాయి. గాయాలు వెంటాడుతుండడంతో ఒక్కొక్కరు టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. బోణీ కోసం నిరీక్షిస్తున్న ఐర్లాండ్.. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (Paul Striling) సేవల్ని కోల్పోనుంది. లీగ్ దశ తొలి మ్యాచ్‌లో గాయపడిన స్టిర్లింగ్ అనూహ్యంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఆస్ట్రేలియాపై సంచలన విజయంతో సూపర్ 8 రేసులో నిలిచిన.. జింబాబ్వేకు సీనియర్ ఆటగాడు బ్రెండన్ టేలర్ (Brendon Taylor) అందుబాటులో ఉండడం లేదు.
భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న పురుషుల టీ20 ప్రపంచకప్ నుంచి పలువురు ఆటగాళ్లు అనూహ్యంగా నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే భారత పేసర్ హర్షిత్ రానా.. శ్రీలంక క్రికెటర్లు ఇషాన్ మలింగ, వనిందు హసరంగలు గాయాలతో వైదొలగగా.. మరో ఇద్దరూ టోర్నీకి దూరమయ్యారు. ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, జింబాబ్వే వెటరన్ ప్లేయర్ బ్రెండన్ టేలర్ సైతం ఇంటి బాట పట్టారు. ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్టిర్లింగ్ గాయపడ్డాడు. స్కానింగ్ పరీక్షల్లో అతడి ఎడమ మోకాలి లిగమెంట్ దెబ్బతిన్నట్టు గుర్తించారు. దాంతో.. స్టిర్లింగ్ వరల్డ్‌కప్ మొత్తానికి దూరమవ్వడంతో సామ్ టాపింగ్‌కు చోటు లభించింది.
The uncapped Sam Topping has been named as Stirling’s replacementhttps://t.co/8889OXDiWG
— ESPNcricinfo (@ESPNcricinfo) February 13, 2026
సుదీర్ఘ నిషేధం తర్వాత జింబాబ్వే జట్టులోకి వచ్చిన 40 ఏళ్ల టేలర్ ప్రస్థానం కూడా ముగిసింది. లీగ్ దశలో ఒమన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా అతడు కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. 31 పరుగుల వద్ద రిటైర్ట్ హర్ట్‌గా మైదానం వీడిన టేలర్‌కు స్కానింగ్ పరీక్షలు జరపగా.. కోలుకునేందుకు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. శుక్రవారం ఆస్ట్రేలియాతో టాస్కు ముందు కెప్టెన్ సికిందర్ రజా మాట్లాడుతూ.. టేలర్ ఇంకా కోలుకోలేదని, అతడు మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని చెప్పాడు. సో.. అతడి స్థానంలో కరన్ స్క్వాడ్‌లోకి వచ్చాడు.
A setback for Zimbabwe with veteran wicketkeeper-batter Brendan Taylor ruled out pic.twitter.com/7286zY4ro2
— ESPNcricinfo (@ESPNcricinfo) February 13, 2026