సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 2: బీజేపీ, కాం గ్రెస్ నాయకులు ప్రజలకు గొడవలు నేర్పితే సీఎం కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధిని ప్రజలే చెప్తున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో ఆదివారం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ తన అనుచరులు సుమారు 270 మందితో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కం డువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా సుమారు 3 వేల మందితో ఏ ర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో బడా నాయకులమని చెప్పుకొంటున్న వారు గతంలో చేసిన రౌడీ రాజకీయాలను, సిండికేట్ దందాలను ఇక్కడి ప్రజలెప్పటికీ మరిచిపోరని తెలిపారు. కొట్లాటలు, గొడవలు, స్వార్థ రాజకీయాలకు మాత్రమే వాడుకొని నిరంతరం కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన ఘటనలు ప్రజలకు ఇంకా గుర్తుకున్నాయని చెప్పారు.
సీఎం కేసీఆర్ అతి తక్కువ సమయంలో అన్ని రంగాలను ఎవరూ ఊ హించని రీతిలో అభివృద్ధి చేసి యావత్ దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారని ఆ యన కొనియాడారు. ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని తెలిపారు. అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలే స్వచ్ఛందంగా వివరిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యద ర్శి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.