హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన ప్రజాప్రతినిధుల మేడిగడ్డ సందర్శనకు తాము హాజరు కావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఈ సందర్శనకు దూరంగా ఉండాలన్నది తమ పార్టీ అభిప్రాయమని చెప్పారు.