BJP Chief : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు (N Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీ బండిపై విమర్శలు పెల్లుబికుతున్న వేళ బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. సాయి భగీరథ్‌పై పోక్సో కేసుతో తమ ఎంపీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బండి కుమారుడు సాయి భగీరథ్‌పై పోక్స్ కేసులో విచారణ అవసరం. కచ్చితంగా విచారణ జరగాల్సిందే. ఈ కేసుతో బండి సంజయ్‌కు ఏంటీ సంబంధం? బండి సంజయ్ మా పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి. కానీ ఈ వ్యవహారంలో పార్టీకి దానికి సంబంధం లేదు.
#WATCH | Hyderabad, Telangana | On a woman reportedly attempted to lure Union Minister Bandi Sanjay’s son into a honey trap, State BJP President N Ramchander Rao says, “It is a matter of investigation and it is being carried out. But how is Bandi Sanjay concerned with it? The… pic.twitter.com/b0nCcyqjt3
— ANI (@ANI) May 11, 2026
ప్రతిపక్షాలు అనవసరంగా ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నాయి. చట్టంను తన పని తాను చేసుకోనివ్వండి. పోక్సో కేసు బండి కుమారుడు భగీరథ్‌కు, అతడిపై ఫిర్యాదు చేసిన కుటుంబానికి సంబంధించినది. ఆరోపణలను నిజమని నిరూపిస్తారా? లేదంటే భగీరథ్‌పై ఆరోపణలు అబద్దమా? అనేది విచారణ బయటపడుతుంది’ అని రామచందర్‌రావు పేర్కొన్నారు.
బండి సంజయ్ కొడుకు POCSO కేసు మీద స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
బండి సంజయ్ కొడుకు చేసిన పనికి ఆయనకు ఏం సంబంధం లేదు
బండి సంజయ్ మా పార్టీ ఎంపీ, కేంద్ర మంత్రి కానీ ఈ వ్యవహారంలో పార్టీకి దానికి సంబంధం లేదు https://t.co/MTFSdLmgKw pic.twitter.com/UQNk56S5NQ
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2026