MLA Rajasingh | హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. రామచందర్ రావుకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రామచందర్ రావును అధ్యక్షుడిగా ప్రకటించిన మరుక్షణమే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన విషయం విదితమే. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు గత నెల 30న కిషన్ రెడ్డికి రాజాసింగ్ లేఖ రాశారు. ఈ లేఖను బీజేపీ అధిష్టానం ఇవాళ ఆమోదించింది. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో రాజాసింగ్ ఉన్నారు. అమర్నాథ్ యాత్ర నుంచి రాగానే రాజాసింగ్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.