వంగపల్లి శ్రీనివాస్
బొడ్రాయిబజార్(సూర్యాపేట), మే 30: దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ మాదిగ జాతికి శత్రువులని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం సూర్యాపేట గాంధీపార్కులో నల్లగొండ పార్లమెంట్ స్థాయి సమావేశంలో వంగపల్లి పాల్గొన్నారు. దేశాన్ని గతంలో పాలించిన కాంగ్రెస్, ప్రస్తుతం పాలిస్తున్న బీజేపీ మాదిగలను మోసం చేశాయని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతామని చెప్పి బీజేపీ మాట దాటేసిందని ధ్వజమెత్తారు. బీజేపీని గ్రామాల్లో తిరుగనిచ్చేది లేదని తేల్చిచెప్పారు. ప్రతి దళితుడికీ దళితబంధు పథకాన్ని ఇవ్వాలని సీఎం కేసీఆర్కు విజ్ఞప్తిచేశారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించి చెప్పు, డప్పు కార్మికులకు పింఛన్ అందించాలని కోరారు.